హైదరాబాద్, జూలై6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2017లో కొత్త జిల్లాలకు అనుగుణంగా అదనపు పోస్టులను సృష్టించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాల ఏర్పాటుతోపాటు వాటిల్లో 40శాఖల జిల్లా కార్యాలయాలు, 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజినల్ కార్యాలయాలు, 76 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 25 డీఎస్పీ కార్యాలయాలు, 31పోలీస్ సరిళ్లు, 7 పోలీస్ కమిషనరేట్లు, 4,383 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయని తన లేఖలో పేర్కొన్నారు.
ఆయా కార్యాలయాల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 సర్వీస్ పోస్టులు పెద్ద ఎత్తున అవసరం ఏర్పడ్డాయని, వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు.