ముషీరాబాద్, జూలై 29 : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, బకాయిలు విడుదల చేయాలని అడిగితే సీఎం రేవంత్‌రెడ్డి తట్టుకోలేకపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మం డిపడ్డారు. ఆంధ్రా ఎంపీ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్య మం చేసుకోవాలని చెప్పడం సమంజసం కాదని ధ్వజమెత్తారు. బీసీల సమస్యలపై సీఎంను ప్రశ్నిస్తే పట్టించుకోకపోగా.. పసలేని మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. బుధవారం బీసీభవన్‌లో సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకే కొత్తకొత్త జీవోలు తీసుకొచ్చి విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, పీజీ, డిగ్రీ తదితర కోర్సులు పూర్తయిన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. 18 ఏండ్లుగా కొనసాగుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జలై 29(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాల కొరత, కమీషన్ ఏజెంట్లు, దళారీల దోపిడీ, అధికారుల పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని రైతు కమిషన్ పేర్కొన్నది. బుధవారం సచివాలయంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు గోపాల్‌రెడ్డి, భవానీరెడ్డి తదితర రైతులు సీఎస్ సంజయ్‌ను కలిసి రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ల పరిస్థితులపై సమగ్ర నివేదిక అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్కే భవన్లో రైతు కమిషన్ నిర్వహించిన సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు, అధికారులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, రైతులు చేసిన సూచనలు, అభిప్రాయాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని సీఎస్ సంజయ్ హామీ ఇచ్చారని రైతు కమిషన్ సభ్యులు తెలిపారు.