అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి: ఆర్ కృష్ణయ్య
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ముషీరాబాద్, జూలై 11: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. 14న చేపట్టే సత్యాగ్రహ దీక్షలో అందరూ పాలుపంచుకోవాలని రాజకీయ పార్టీలకు, విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. 16న కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడిలో పాల్గొనాలని కోరారు.
ఇంకా చదవాలసిన వార్తలు…
ఫీజు రీయింబర్స్మెంట్ రద్దుకు కుట్ర: జాజుల
హైదరాబాద్, జూలై11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ కుట్రలు చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. తక్షణమే బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. శనివారం బీసీ నేతల బృందం లోక్‌భవన్‌లో గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు.
మూసీ పేరిట బస్తీలపై హైడ్రా దండయాత్ర : గోసుల
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రాజెక్టు ముసుగులో హైడ్రాను అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ సర్కార్ బస్తీలపై దండయాత్ర చేస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం జీవో 58, 59 కింద పట్టాలిచ్చి బస్తీవాసుల బతుకుల్లో వెలుగులు నింపారని శనివారం ప్రకటనలో గుర్తుచేశారు.
వేతన సవరణ ఎరియర్స్ చెల్లించాలి : ఆర్టీసీ జేఏసీ
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : 2021 వేతన సవరణ ఎరియర్స్ చెల్లించాలని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి పలు అంశాలపై జేఏసీ ప్రతినిధులు చర్చించారు. సమ్మె డిమాండ్లపై ఈడీల కమిటీతో చర్చల సందర్భంగా అంగీకరించిన అంశాలను మినిట్స్ రూపంలో జేఏసీకి ఇవ్వాలని, వెంటనే వాటిపై సర్క్యులర్ విడుదల చేసి అమలు చేయాలని కోరగా.. ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు ఇస్తామని మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చినట్టు ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్ యాదగిరి పాల్గొన్నారు.
27న ఢిల్లీలో జర్నలిస్టుల చలో పార్లమెంట్
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను కేంద్రప్రభుత్వం వెంటనే పరిషరించాలని డిమాండ్ చేస్తూ 27న ‘తెలంగాణ జర్నలిస్టుల చలో పార్లమెంట్” కార్యక్రమాన్ని తలపెట్టినట్టు తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ వెల్లడించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఒక రోజు ధర్నా నిర్వహించనున్నట్టు శనివారం ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

