BC Reservations | హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. అన్ని బీసీ సంఘాల మద్దతుతో బంద్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అందరూ కలిసి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. రాజకీయ పార్టీలు, కుల సంఘాలు బంద్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరడం జరిగిందని తెలిపారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి చెప్పారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కోర్టులు జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. బీసీ సంఘాలు ఇప్పటికే పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం, నిరసనలు, ధర్నాలు చేస్తున్నారని ఎంపీ ఆర్.కృష్ణయ్య వెల్లడించారు.