హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తేతెలంగాణ) : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలువనున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నా రు. మూడు రాష్ర్టాలకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖాశర్మ, ఒడిశా నుంచి సుజీత్కుమార్ను అభ్యర్థులుగా ప్రకటించింది. గతంలో వైసీపీ తరఫున దాదాపు రెండేండ్లపా టు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందగా, కూటమి ఘన విజయం సాధించిన నే పథ్యంలో ఆర్ కృష్ణయ్యతో బీజేపీ, కూ టమి నేతలు చర్చలు జరిపారు. దీంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, మరోసారి బీజేపీ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగుతున్నారు.