హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కార్పొరేటు విద్యాసంస్థలను కట్టిడి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కేవలం ధనార్జనే ధ్యేయం గా యాజమాన్యాలు అధిక మొత్తంలో ఫీజు లు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. వాటిపై విచారణ జరిపి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు.