కాశీబుగ్గ, మార్చి 9 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం సింగిల్పట్టి మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ ధర రూ.41 వేలు పలుకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మార్కెట్కు సుమారు 40 వేల బస్తాలు వచ్చినట్టు మార్కెట్ అధికారులు తెలిపారు.