భరోసా లేదు.. గిరోసా లేదు పో.
ఆకలినైనా సహిస్తం కానీ అన్యాయాన్ని సహించం.. ఇది తెలంగాణ గడ్డ పౌరుషం.. తప్పు జరిగినప్పుడు నిలదీయడం ఈ గడ్డ నైజం.. మాట తప్పినోళ్లని, మాయమాటలు చెప్పినోళ్లని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశ్నించడం ఇక్కడి ప్రజల స్వభావం.. కడుపు ఎండినోడిని కాదని కడుపు నిండినోడికి పెడుతుంటే ఖాళీ కడుపుతోనూ కదం తొక్కి గడగడలాడించడం తెలంగాణ గుండె ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం.. రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, పలు పథకాలకు అనర్హులను ఎంపిక చేశారంటూ ఆడ, మగ, యువకులు, వృద్ధులు తిరగబడ్డారు. గ్రామ సభల సాక్షిగా నిప్పులాంటి నిజాన్ని నిర్భయంగా
ఎలుగెత్తి చాటారు.
పోలీసుల మధ్యే గ్రామసభ
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని బోయపల్లిలో పోలీసు అధికారులతో కలిసి గ్రామసభ నిర్వహిస్తున్న తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్
గ్రామ సభనా.. కాంగ్రెస్ సభనా?