పాలకుర్తి, డిసెంబర్ 15 : గడిచిన రెం డేండ్ల కాంగ్రెస్ సర్కార్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, సర్పం చ్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపు కోరుతూ సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం కోతులబాధ, తిరుమలగిరి, ఈరవెన్ను, పాలకుర్తి, రాఘవాపురం, బమ్మెర, వల్మిడి, ముత్తా రం, కిష్టాపురం తండా, సిరిసన్నగూడెం గ్రామాల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి దుర్మార్గపు పాలన సాగిస్తున్నాడని విమర్శించారు.ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న పాలకుర్తి ప్రజలకు తనవంతు సేవ చేస్తానని చెప్పారు.
మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ముసాపేట, డిసెంబర్ 15 : అధికారం కోసం కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాయమాటలు నమ్మొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లి, కన్మనూరు, చిన్న మునగాల్చేడ్, పెద్ద మునగాల్చేడ్, పొన్నకల్‌లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి బెదిరింపులకు పాల్పడటం సరికాదని హితవుపలికారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అవమానిస్తే.. ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్ప డం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాభివృద్ధి కుంటుపడిందని, సాగు, తాగునీరు, కరెంట్, ధాన్యానికి బోనస్ లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపా రు. జీపీ ట్రాక్టర్లలో డీజిల్ పోయించే దిక్కులేక గ్రామాల్లో చెత్త పేరుకుపోయిందన్నారు. గ్రా మాలు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలని కోరారు.