KCR | బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలన్నారు. శాసనసభ, మండలిలో జరిగే ప్రతి చర్చలో పాల్గొనాలి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఉభయసభల్లో ఎండగట్టాలన్నారు.
సీఎం రేవంత్ అసెంబ్లీలో, బయట బూతులు మాట్లాడుతున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. పాలన చేతకాక ఈ తరహాలో వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్ అని అన్నారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పాలన కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పోవడం ఖాయమని అర్థమైంది. రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం. ఈ విషయం ఆ పార్టీ నేతలకు అర్థమైంది. అందుకే ఈ దోపిడీ చేస్తున్నారు. స్పీకర్ పక్షపాత వైఖరి అప్రజాస్వామికమన్నారు. సభలో స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
బూతుల వీరుడితో చర్చకు అసెంబ్లీకి రమ్మంటున్నారు. నా చావు కోరుతూ పదే పదే మాట్లాడుతున్నారు. రాష్ట్రప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది. తెలంగాణ రైజింగ్ కాదు.. డౌన్ ఫాల్ అవుతోందన్నారు కేసీఆర్ .
ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన బీఆర్ఎస్ఎల్పీ సంయుక్త సమావేశం.
సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు pic.twitter.com/AAzPgcmE16
— BRS Party (@BRSparty) September 6, 2026
Bittu Tabahi | నదిని శుభ్రం చేసిన యువకుడు.. బిట్టు తబాహికి పద్మ ఇవ్వాలన్న సింగర్ చిన్మయి!
న్యూడ్ ఫొటోలతో కాంగ్రెస్ నాయకుడి బెదిరింపులు.. సూర్యాపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం
Bigg Boss | బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లకుండానే ఎలిమినేషన్.. క్రిటిక్‌కి షాకిచ్చిన ఆడియన్స్!