హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తేతెలంగాణ) : ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ ఆర్థిక, వాణిజ్య, ఉపాధి, శిక్షణశాఖ మంత్రి రాస్బేట్స్ సోమవారం సింగరేణి భవన్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి అధికారులతో ప్రత్యేక సమావేశమై.. మైనింగ్‌రంగంలో అధునాతన టెక్నాలజీపై చర్చించనున్నారు. వనాడియం, కాపర్, గ్రాఫైట్, కోబాల్ట్ తదితర వాటిపై సింగరేణి-క్వీన్స్లాండ్ మధ్య పరస్పర సహకారంపై చర్చలు జరపనున్నారు. సింగరేణి భవన్‌ను సందర్శించిన తొలి విదేశీ మంత్రిగా రాస్బేట్స్ నిలుస్తారని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ తెలిపారు.