రాయపర్తి: పండుగ పూట చేపలు పడదామని చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో వల వేసి చేపల కోసం చూస్తున్నారు. ఇంతలో ఏదో బరువుగా తగలడంతో ఆశగా వలను పైకి గుంజారు. అందులో చేపలకు బదులు కొండ చిలువ ఉండటంతో చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి (Rayaparthi) మండలంలోని కొండాపురంలో చోటుచేసుకున్నది. హోలీ పండుగ సందర్భంగా మత్స్యకారులు గ్రామంలోని ఊర చెరువులో చేపల కోసం వలలు వేశారు. ఈ క్రమంలో జాలర్ల వలలో కొండచిలువ పడింది. ఈ విషయం దావనంలా వ్యాపించడంతో కొండచిలువను చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకున్నారు.