హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కేంద్ర సర్వీసుల మాజీ అధికారి, సామాజిక కార్యకర్త పీవీఎస్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ సీఎం పదవి నుంచి రేవంత్‌రెడ్డిని తొలగిస్తే ఆయన కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని శర్మ స్పష్టం చేశారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగుతూనే లోపలి నుంచి ఆ పార్టీని బలహీనపరుస్తున్నారని ఆయన ఆరోపించారు.
టీడీపీ అనుకూల మీడియా సంస్థలను ఉపయోగించుకుంటూ తెలంగాణలో టీడీపీని పునరుద్ధరించేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, దీన్ని కాంగ్రెస్ పార్టీ గమనించి ఆలస్యం కాకముందే మేలొంటుందని ఆశిస్తున్నానని ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నేపథ్యం రేవంత్‌రెడ్డికి ఉండటంతో శర్మ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకున్నది. కానీ, ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ వర్గాలుగానీ, ప్రభుత్వంగానీ ఇంకా స్పందించలేదు.