హైదరాబాద్ : వరద(Heavy floods) వస్తుందని ఖమ్మం(Khammam) ప్రజలకు ముందు చెప్పలేదు. ఇదే ప్రభుత్వ ఫెయిల్యూర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay )అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శనివారం 21 అడుగులకు నీటిమట్టం చేరింది, 21 అడుగులకు చేరిన ఒక ఇల్లు కూడా మునగదన్నారు. కాకపోతే నీటిమట్టం 18 అడుగులకు చేరగానే మైకులలో అనౌన్స్మెంట్ ఇచ్చి ట్రాక్టర్లు వ్యాన్లు తీసుకొచ్చి ప్రజలను సామగ్రితో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
ఆదివారం ఉదయం 33 అడుగులకు నీటిమట్టం చేరింది.
అప్పటికి ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు చేయలేదని ఆరోపించారు. ప్రజలే స్వచ్ఛందంగా అయ్యో రామచంద్ర అని అనుకుంటూ వారి సోమాగ్రిని వదిలేసి వేరే ప్రాంతంలోకి వెళ్లిపోయారన్నారు. మాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రజల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. రిలీఫ్ మెజర్స్ తీసుకోవడంలో బాధితులకు ఆహారం, నీళ్లు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి నాపై తప్పుడు ఆరోపణలు చేశారని పువ్వాడ అన్నారు.