బూర్గంపాడు, మే 1 : కాంట్రాక్టు కార్మికుల వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేసి, వారి సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ వద్ద కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 37వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుతో కలిసి అజయ్ సందర్శించి సంఘీభావం తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని కార్మికులు 37 రోజులుగా దీక్షలు చేస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం సరికాదన్నారు. ఐటీసీ సంస్థ కార్మికుల సహకారంతో లాభాల బాటలో పయనిస్తున్నా.. వారి ప్రయోజనాలను పట్టించుకోకపోవడం శోచనీయమని మండిపడ్డారు. యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.