ఖమ్మం, ఆగస్టు 22: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10కి 10 సీట్లు సాధించి గులాబీ జెండా ఎగరేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ఖమ్మం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గులాబీ జెండా మెడలో ఉంటే ఎంతో ధైర్యం వస్తుందని, ఈ జెండానే రాష్ర్టాన్ని సాధించి పెట్టిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో లీడర్, క్యాడర్ అనే తేడా లేదని, అంతా ఒకే కుటుంబమని చెప్పారు. తనకు మరోసారి సీటు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు.