మహదేవపూర్(కాళేశ్వరం),డిసెంబర్ 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన అన్నారం బరాజ్‌లో పలు పరీక్షలు నిర్వహించేందుకు పుణెకు చెందిన నిపుణుల బృందం శుక్రవారం బరాజ్‌కు చేరుకుంది. ఇరిగేషన్ అధికారులతో కలిసి పూర్తిస్థాయిలో పరిశీలించి, సాంకేతిక అంశాలపై చర్చించారు.
పలురకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.