Public Voice | భాషమ్మ, పెంటమ్మ, లింగమ్మ, సాయమ్మ, సుశీల బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇరుగుపొరుగోళ్లు. వయసు పైబడి వీళ్లందరూ ఇంటికాడనే ఉంటున్నరు. పనీ చేయలేరు. వృద్ధాప్యానికి తోడు.. పేదరికం, జబ్బులు వాళ్లకు అదనపు భారాలు. ఆ బాధలు బాపే కొడుకులూ అదే పేదరికంలో ఉన్నరు. ‘మరి ఎట్ల బత్కుతున్నరు?’ అనడిగితె.. ‘ఆ.. ఏమున్నది కొడుక, ఉన్న ఒక్క కొడుకు పట్నం పోయిండు. అపార్ట్మెంట్ల వాచ్మెన్ పని చేస్కుంట ఇద్దరు బిడ్డల్ని సదివిచ్చుకుంటున్నడు.
నేనొక్కదాన్నే ఊళ్ల ఇంటికాడ పడున్న. ఒకపాలి ఇల్లు కూలి మీదవడ్డది. ఇంకోపాలి ఎద్దు ఎత్తేసింది. మూడోపాలి యాక్సిడెంట్ అయింది. ఏ పనీ చేయనీకి రాదు. కైకిలి పోనీకి రాదు. కొడుకు అప్పుడప్పుడూ వచ్చి సూసి పోతడు. ఇల్లు సూసుకుంట ఊళ్లనే బతుకుతాన్న. ఫస్ట్ తారీఖు వస్తె కేసీఆర్ ఫించనొస్తది. ఆ పైసల్తోని ఉప్పూపప్పూ, కూరగాయలు తెచ్చుకోని ఇంత తింటాన్న. ఎప్పుడన్నా సర్ది జేస్తె మందుగోలీలు తెచ్చుకుంటాన్న’ అన్నది భాషమ్మ. ఆమె మాటలు పూర్తికాగానే.. ‘ఇగో కొడుక, కేసీఆర్ ఇచ్చే రెండేల రూపాయల్తోనే బతుకుతాన్నం. ఫించన్ పైసల్తోని ఇంత బువ్వ తింటున్నం. కొడుకులెక్క ఆసరా అయితాండు. తండ్రి లెక్కే చూసుకుంటున్నడు. మాకు కొడుకైనా, తండ్రైనా కేసీఆరే!’ అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టింది పెంటమ్మ.
– భాషమ్మ, పెంటమ్మ, బ్రాహ్మణపల్లి, నర్సాపూర్ మండలం, మెదక్ జిల్లా