హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీఆర్టీయూ కోరింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి వినతిపత్రం అందజేశారు.
సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్లు, జీహెచ్ఎం, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులకు వెంటనే పదోన్నతులను కల్పించాలని విజ్ఞప్తి చేశారు.