హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని పీఆర్టీయూ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డితో కలిసి వారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. వచ్చే ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్లో జీవో 317 ద్వారా స్థానికత కోల్పోయిన వారికి సొంత జిల్లాలో పనిచేసేలా చూడాలని కోరారు.
రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో అమలు చేస్తున్న జియోఅటెండెన్స్ను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ని కలిసిన వారిలో పీఆర్టీయూ (తెలంగాణ) అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధా న కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, గౌరవాధ్యక్షుడు పీ సత్యనారాయణ, కోశాధికారి ఎన్ చంద్రశేఖర్ రావు ఉన్నారు.