బోనకల్లు, జూన్ 19 : కాంగ్రెస్ నాయకుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు, బాధితులు ఖమ్మం జిల్లా బోనకల్లు పోలీస్‌స్టేషన్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మడుపల్లి వెంకటేశ్వర్లు వారం క్రితం ఆటోలో వెళ్తుండగా..
అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దప్రోలు సైదులు, అతడి కుమారుడు కార్తీక్ ఆటోను ఆపి ఇనుపరాడ్‌తో వెంకటేశ్వర్లుపై దాడిచేశారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా విచారణ చేపట్టకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, బాధితులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.