హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): బోర్డు నిర్వహణకు నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రస్తుతం టెలిమెట్రీల ఏర్పాటు కోసం విడుదల చేసిన నిధులను వినియోగించుకుంటున్నామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణకు మరోసారి లేఖ రాసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీ నిర్వహణకు అవసరయ్యే బడ్జెట్‌ను రెండు రాష్ట్రాలు చెరిసగం భరించాల్సి ఉన్నది.
గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రస్తుతం బోర్డు నిర్వహణ కోసం రూ.11.50 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన ఏపీ, తెలంగాణ.. ఆ నిధులు సమాన నిష్పత్తిలో చెల్లించాల్సి ఉన్నది. కానీ, ఇప్పటివరకు బడ్జెట్లో ఆమోదించిన నిధులను విడుదల చేయలేదు. వచ్చే నెల జీతాల చెల్లిం పు అసాధ్యమని అధికారులు చెప్తున్నారు.