హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): పులిచింత దిగువన చేపడుతున్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీమ్ ప్రస్తుత స్థితిగతులపై పూర్తి వివరాలు అందించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పులిచింతల దిగువన ఊరవాగు, బుగ్గవాగుపై రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీమ్ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ ప్రాజెక్టును చేపట్టకుండా చూడాలని కేంద్ర జల్‌శక్తి శాఖతోపాటు, కే ఆర్‌ఎంబీకి ఏపీ ఫిర్యాదు చేసింది. దీనిపై బోర్డు స్పందిస్తూ.. లిఫ్ట్ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని తెలంగాణ సర్కారుకు లేఖ రాసింది.