దుబ్బాక, జనవరి 18 : సిద్దిపేట జి ల్లా దుబ్బాక నియోజకవర్గంలో మళ్లీ ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. శనివారం దుబ్బాక నియోజవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల లో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో కలి సి దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. చే గుంటలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, దీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సభావేదికపైన కూర్చోవడంపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం తెలిపా రు.
అనంతరం నియోజకవర్గంలోని అ క్బర్పేట-భూంపల్లి మండలకేంద్రంలో ఆరోగ్యకేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వద్ద అధికారులు ప్రొటోకాల్ పా టించలేదని, ఓడిపోయిన కాంగ్రెస్ నా యకులతో ప్రారంభోత్సవ కార్యక్రమా లు నిర్వహించడం సరికాదని బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్త పడాల నరేశ్‌పై దుబ్బాక సీఐ శ్రీనివాస్ బహిరంగంగా చేయి చేసుకోవడంపై దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని ఎమ్మెల్యే మండిపడ్డారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించాల ని, చిల్లర రాజకీయాలు మానుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. చేగుంట మండలం వడియారంలో మంత్రి కొండా సురేఖ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి వేదిక మీదికి రావడంతో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి సురేఖ జోక్యం చేసుకొని శ్రీనివాస్‌రెడ్డిని వెనక్కి పంపారు.