వనపర్తి టౌన్, జూలై 22 : వనపర్తి కాంగ్రెస్లో ప్రొటోకాల్ రగడ నెలకొన్నది. వనపర్తిలో మెడికల్, నర్సింగ్ కళాశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి గోపాల్పేట వరకు బస్సును ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. సోమవారం బస్సును ప్రారంభించేందుకు చిన్నారెడ్డి అనుచరులతో కలిసి కళాశాల ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. తనకు సమాచారం లేకుండా బస్సును ఎలా ప్రారంభిస్తారంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి అధికారులను ఫోన్లో నిలదీశారు. దీంతో బస్సు ప్రారంభాన్ని త్వరలో చేపడుతామని అధికారులు నచ్చజెప్పడంతో అందరూ వెళ్లిపోయారు.
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిధిలో కుక్కకాట్లపై ప్రజలకు అవగాహన కల్పించి దాడులను నియంత్రించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ సూచించారు. సోమవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ, వెటర్నరీ, బ్లూక్రాస్, ఇతర జంతు సంక్షేమ సం ఘాల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి కుక్కల బెడదపై చర్చించా రు. ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, బ్లూక్రాస్ సభ్యులతో అపెక్స్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. నగరంలో వీధి కు క్కల సర్వేతోపాటు స్టెరిలైజేషన్, యాంటీరేబిస్ వ్యాక్సిన్ డ్రైవ్ చేపడతామని తె లిపారు. సమావేశంలో డీసీఎంఏ వీపీ గౌతం, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ గోపి, అమల, వెటర్నరీ కళాశాల వైద్యులు పాల్గొన్నారు.