వికారాబాద్ : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Narender Reddy )అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు(BRS Protests) కొనసాగుతున్నాయి. నరేందర్ రెడ్డి వెంటనే విడుదల చేయాలని కోస్గిలో బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తప్పుడు కేసులతో ప్రశ్నించే గొంతులను అణిచివేయలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడతు న్నదని ఆరోపించారు. ఆందోళనలు చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వాహనాల్లో్ అక్కడ నుంచి తరలించారు.
కాగా, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో వాకింగ్ వెళ్లిన నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఫోన్ చేశారు. అక్రమ అరెస్టుపై ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక నియంత విధానాలపై పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. నరేందర్ రెడ్డి సతీమణి శృతికి కూడా కేటీఆర్ కాల్ చేసి ధైర్యం చెప్పారు. మీ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ మొత్తం అండంగా ఉంటుందని తెలిపారు. నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కోర్టులో న్యాయపోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలు