తాండూరు, డిసెంబర్ 17: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి ప్రయత్నించిన వారిని పట్టించినందుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై కేంద్రం కక్షగట్టిందని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మండలాల్లో ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి ఆపై దహనం చేశారు. అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని అక్రమ కేసులతో కేంద్రం ఏమీ చేయలేదని, బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొడతారని వారు హెచ్చరించారు.