జనగామ, జూలై 11 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతూ జనగామలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం యువకులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, డీఎస్సీ వాయిదా వంటి అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు పిలుపునిచ్చారు.
నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు అమ్ముడు పోయారని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. నిరసనలో నిరుద్యోగ జేఏసీ నాయకులు, కేయూ జేఏసీ నాయకులు గన్ను కార్తీక్, ఆసర్ల సుభాష్, తుంగ కౌశిక్, వెంపటి అజయ్ తదితరులు పాల్గొన్నారు.