ఆర్మూర్‌టౌన్, జూన్ 9: యూరియా యాప్ రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఆదర్శ గ్రామమైన అంకాపూర్‌లో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యూరియా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌ను తొలగించి, పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
కొందరు రైతులకు యూరియా యాప్ వాడటం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా సరఫరాపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని అన్నారు. దీంతో రైతులకు సరిపడా యూరియా అందడంలేదని పేర్కొన్నారు. రైతులను చిన్నచూపు చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు.