చేగుంట, ఏప్రిల్ 20: మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఆదివారం సాయ్ంర తం వడగండ్ల వానకు అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. చేగుంట మండలం కర్నాల్‌పల్లి, మక్కరాజిపేట్, గొల్లపల్లి, రాంపూర్ తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో వడగండ్ల వానకు వడ్లు నేలరాలాయి. ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టి చేతికి వచ్చిన పంట నేలరాలడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతులు సోమవారం చేగుంట-గజ్వేల్ రహదారిలోని కర్నాల్‌పల్లి-మక్కరాజిపేట రహదారిపై రాలిపోయిన వరి గెలలతో బైఠాయించారు. వెంటనే పంటనష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై చైతన్యకుమార్‌రెడ్డి అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.