శాయంపేట : విజయవాడ -నాగ్పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి శివారులో నేషనల్ హైవే అధికారులు, సంబంధిత మేఘా కంపెనీ ప్రతినిధులు గురువారం మారింగ్ చేశారు. తమ భూములకు ధర నిర్ణయించకుండా మారింగ్ చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధర నిర్ణయించి డబ్బులు చెల్లించిన తరువాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. డివిజన్లోని పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే శాయంపేట మండలం గట్లకానిపర్తి శివారు నుంచి వెళ్తున్నది. మూడున్నర కిలోమీటర్ల దూరం హైవేకోసం 34 ఎకరాల భూమిని రైతులు కోల్పోతున్నారు. 85 మంది రైతులు నిర్వాసితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టు పనులను మేఘా కంపెనీ చేపట్టినట్టు రైతులు తెలిపారు.