చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Raod Accident) జరిగింది. సోమవారం ఉదయం 7.05 గంటల సమయంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును మీర్జాగూడ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో 21 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆర్టీసీ, టిప్పర్ డ్రైవర్లు కూడా ఉన్నారు. ప్రమాదం ధాటికి బస్సు కుడి వైపు నుజ్జునుజ్జు అయింది. బస్సు డ్రైవర్‌తోపాటు అతని వెనుక ఉన్న వైపు కూర్చున్న 18 మంది దుర్మరణం చెందారు. టిప్పర్‌లో ఉన్న కంకర బస్సులో పడిపోవడంతో పలువురు కంకర కింద కూరుకుపోయారు.

కాగా, ఘటనా స్థలానికి వెళ్లిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను (Kale Yadaiah) స్థానికులు అడ్డుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. రోడ్డు వెడల్పు చేయాలని కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదందూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని నిలదీశారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే కాలె యాదయ్య అక్కడి నుంచి చేవెళ్ల దవాఖానకు వెళ్లిపోయారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరిశీలించారు. వైద్యులను బాధితుల పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.
మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత
ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ
ఎమ్మెల్యే కాలె యాదయ్య పైకి రాళ్లు ఎత్తుకున్న ప్రజలు
ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటు నినాదాలు
రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని ఆగ్రహం
నిత్యం ఈ… https://t.co/zPEQ72vAv0 pic.twitter.com/R6fvY0uarz
— Telugu Scribe (@TeluguScribe) November 3, 2025