KTR | కాంగ్రెస్ అంటేనే కన్నింగ్.. కేటీఆర్ ధ్వజం
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని మండిపడ్డారు. తెలంగాణలో అర్థ గ్యారెంటీ అమలు, మిగతా గ్యారెంటీలకు అరవై షరతులు అని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని మండిపడ్డారు. తెలంగాణలో అర్థ గ్యారెంటీ అమలు, మిగతా గ్యారెంటీలకు అరవై షరతులు అని ఎద్దేవా చేశారు. అబద్ధాల కాంగ్రెస్‌లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అమలవుతున్నది ఒకే ఒక్క గ్యారంటీ.. అది మోసం అంటూ ఫైరయ్యారు.
తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి సంబంధించిన నిరసన సెగ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి తాకిందని చెప్పారు. రైతు డిక్లరేషన్‌ను ఎలా అమలుచేస్తున్నారో వివరించేందుకు తెలంగాణకు ఎందుకు రావడం లేదని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
రైతు భరోసాపై తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొంటూ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం గేటుకు గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ సందర్భంగా రైతు భరోసాగా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని, ఇప్పుడు దానిపై కాంగ్రెస్ యూ టర్న్ తీసుకున్నదని పేర్కొన్నారు. 2024లో రైతులకు పెట్టుబడి సాయంగా విడుదల చేసింది గుండు సున్నానే అంటూ రాశారు. ఎకరాకు రూ.12 వేలు ఇస్తామంటూ రూ.15 వేలపై సీఎం రేవంత్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారని పోస్టర్లలో తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Protest against Congress Govt’s betrayal of Telangana Farmers has reached AICC office in Delhi@RahulGandhi Ji, Why don’t you come to Telangana and explain how “Farmer Declaration” is being implemented
కాంగ్రెస్ అంటేనే కన్నింగ్!
తెలంగాణలో అర్ధ గ్యారెంటీ అమలు, మిగతా… pic.twitter.com/EoJH4iDth4
— KTR (@KTRBRS) January 7, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

