MP Ranjith Reddy | ఎంపీగా ఉండి ఏం చేశావ్.. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని నిలదీసిన సొంత పార్టీ నాయకులు
గతంలో ఎంపీగా ఉండి ఏం చేశావంటూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని స్థానికులతో పాటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలదీశారు.
- చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థికి నిరసన సెగ
- తాండూరు ఎమ్మెల్యేకూ తప్పని నిలదీత
- వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఘటన
MP Ranjith Reddy | వికారాబాద్, ఏప్రిల్ 19, (నమస్తే తెలంగాణ): గతంలో ఎంపీగా ఉండి ఏం చేశావంటూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని స్థానికులతో పాటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలదీశారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంతో పాటు మైల్వార్, దామర్చేడ్ గ్రామాల్లో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి రంజిత్ రెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో వీరిద్దరికీ చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా రంజిత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది.
బషీరాబాద్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని 25 రోజులు దీక్ష చేస్తే, ఎంపీగా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. గతంలో ఇచ్చిన హామీలపైనే తాము ప్రశ్నిస్తున్నామని, దీనిపై సమాధానం చెప్పాలంటూ పట్టుబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కూడా మహిళలు నిలదీశారు. రుణమాఫీపై ఇప్పటివరకు నిర్ణయమెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చాకే ఓట్లడగాలని స్పష్టం చేశారు. ప్రచారం చేసిన నాలుగు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవడంతో, నేతలంతా చేసేదేమీ లేక పోలీస్ రక్షణలో వెనుదిరిగారు. వారం క్రితం తాండూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ మరువకముందే, తాజాగా ఈ నిలదీతల అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

