Sudarshan Reddy | నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. బోధన్ పట్టణంలో గతంలో శంకుస్థాపన చేసిన పనులకు తిరిగి శంకుస్థాపన చేయడానికి ఆదివారం నాడు సుదర్శన్ రెడ్డి వెళ్లడంతో ప్రజలు నిలదీశారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన పనులకు తిరిగి శంకుస్థాపన చేయడమేంటని మండిపడ్డారు.
ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు బోధన్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని సుదర్శన్ రెడ్డిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నిరసనల నేపథ్యంలో పోలీసు బందోబస్తు నడుమ సుదర్శన్ రెడ్డి వెనుదిరిగివెళ్లారు.
ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిరసన సెగ
బోధన్ పట్టణంలో గతంలో శంకుస్థాపన చేసిన పనులకు తిరిగి శంకుస్థాపన చేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన పనులకు తిరిగి శంకుస్థాపన చేయడం ఏంటని సుదర్శన్ రెడ్డిని నిలదీసిన ప్రజలు… pic.twitter.com/PdOBAmy2LL
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2026