హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌తో పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతున్నదని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా గొప్ప కార్యక్రమాలను చేస్తున్నారని ప్రశంసించారు. ఆదివారం ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా గ్రామస్థులతో కలిసిమారేడు, రావి, ఉసిరి, వేప, జమ్మి, జామ మొకలను నాటారు. రైతులు కలప మొక్కలు పెంచడం ద్వారా అదనపు ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవడంతో పాటు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడి జీవావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషించవచ్చని సూచించారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు మర్ది కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.