హైదరాబాద్ : మహిళలు ఆకాశంలో సగం ఉన్నా..గత ప్రభుత్వాలలో అవకాశాల్లో అట్టడుగున ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక 70 ఏండ్లలో సాధ్యం కానిది సీఎం కేసీఆర్ ఏడేండ్లలో సుసాధ్యం చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు మహిళా దినోత్సవ వేడుకలు జరపాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీ కట్టడం, పని చేస్తున్న మహిళలను గౌరవించడం, సన్మానించడం,
ఆ ప్రాంతంలో మహిళలకు జరిగే అభివృద్ధి వివరించడం వంటి పనులు చేపడుతామన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తామన్నారు. ఇందులో మహిళలంతా భారీ ఎత్తున పాల్గొనాలని మంత్రి సత్యవతి పిలుపునిచ్చారు.