హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నాటింగ్‌హామ్ వర్సిటీ ఆఫ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వర్సిటీ ప్రతినిధి బృందానికి సూచించారు. ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఆఫ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
రాష్ట్ర పర్యటనలో ఉన్న వర్సిటీ ప్రతినిధి బృందం సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాయంలో భేటీ అయ్యింది. యూకే, చైనా, మలేషియాల్లో తమకు విద్యాసంస్థలు ఉన్నాయని వర్సిటీ ప్రతినిధులు చెప్పగా, హైదరాబాద్‌లోనూ ఆఫ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.