హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ సభ్యుడిగా ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథో డ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ బుర్రా వెంకటేశం ఆయనతో పదవి ప్రమాణం చేయించారు. ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల్లో ఆయన కూడా ఒకరు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ పీజీ డిప్లొమా కోర్సుపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(పీజీటీఏయూ) బుధవారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్(నిపమ్)తో కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది.
రాజేంద్రనగర్ పీజీటీఏయూ పరిపాలన భవనంలో జరిగిన సమావేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, నిపమ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సాగర్ హనుమాన్సింగ్ పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.