హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ పెంపు లక్ష్యంగా నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 9 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఈ డ్రైవ్లో భాగంగా ఉపాధ్యాయులంతా ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఇంటింటా ప్రచారం, ర్యాలీలు, కరపత్రాల పంపిణీని చేపడుతారు.