హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో పునరంకితం కావాలని శాసనమండలి బీఆర్ఎస్పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో జయశంకర్‌సార్ చిత్రపటానికి ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ దేశపతి మాట్లాడుతూ తెలంగాణతల్లి తన కోసం నియమించుకున్న అడ్వకేట్ జయశంకర్ అని పేర్కొన్నారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమశక్తులను ఏకం చేయటంలో సార్ క్రియాశీల పాత్ర పోషించారని గుర్తుచేశారు. మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణకు జరిగిన అన్యాయాలను రికార్డు చేసిన గొప్ప ఆలోచనాపరుడని కొనియాడారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వరంగల్ ఏఎస్పీగా ఉన్న సమయంలో సార్‌ను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ చంద్రశేఖర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, రాకేశ్, గెల్లు శ్రీనివాస్, గజ్జెల నగేశ్, ఆంజనేయగౌడ్, అనిల్ కూర్మాచలం, వాల్యానాయక్, వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు పాల్గొన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.