హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ ము మ్మరంగా సాగుతున్నది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం బుధవారం రాత్రి విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకున్నది. వచ్చిన డాటాను కంప్యూటరీకరించే(డిజిటలైజేషన్) ప్రక్రియ ఊపందుకున్నది. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,38,26, 448మంది ఉండగా ఇప్పటివరకు 3,33,85,550 ఎన్యుమరేషన్ ఫారా లను బీఎల్వోలు ఓటర్లకు పంపిణీ చేశా రు. అంటే 98.70 శాతం పంపిణీ పూర్తయింది. ఓటర్ల నుంచి సేకరించిన ఫామ్లలో ఇప్పటివరకు 53,15,291 ఫారా ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇది మొత్తం ఓటర్లలో 15.71 శాతం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వంద శాతం ఫారాల పంపిణీ పూర్తయింది.
నిర్మల్, నిజామాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నల్లగొండ, జనగా మ జిల్లాల్లో 100% ఫారాల పంపిణీ పూర్తయింది. డిజిటలైజేషన్లో గ్రామీణ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. యా దాద్రి జిల్లా 50.93 శాతం డిజిటలైజేషన్తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసిఫాబాద్లో 42.15, నల్లగొండలో 39.61, ఖమ్మంలో 36.81, నిజామాబాద్లో 30.39 శాతం డిజిటలైజేషన్ పూర్తిచేశారు. ఐటీ కారిడార్లు, భారీ జనా భా ఉన్న పట్టణ/నగర పరిధిలోని జిల్లాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. జూలై 31 నాటికి ఈ డాటా ఆధారంగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఒకవేళ ఏవైనా తప్పులు దొర్లినా లేదా పేర్లు మిస్ అయినా.. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల ద్వారా సరిచేసుకొనేందుకు ఓటర్లకు మరో అవకాశం కల్పిస్తారు.