హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న రెగ్యులర్, రెండో ఏఎన్ఎంలు సహా మిగతా ఏఎన్ఎంల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదనాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గురువారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు.
ఐఏఎస్ అధికారి శివశంకర్ రిలీవ్ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ క్యాడర్‌కు చెందిన శివశంకర్ ప్రత్యేక అనుమతితో తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయనను తిరిగి ఏపీకి పంపించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసింది.