డీటీవో వెంకన్న మృతిపై విచారణ.. సీన్ రీ కన్స్ట్రక్షన్తో విశ్లేషణ
భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ నెల 22న భూపాలపల్లి ఆర్టీవో ఆఫీస్ వద్ద బొగ్గు లారీ ఢీకొనడంతో డీటీవో మృతిచెందారు. ప్రమాదంపై జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ బుధవారం విచారణ చేపట్టారు.
- రెండు రోజుల్లో సర్కార్‌కు నివేదిక
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ నెల 22న భూపాలపల్లి ఆర్టీవో ఆఫీస్ వద్ద బొగ్గు లారీ ఢీకొనడంతో డీటీవో మృతిచెందారు. ప్రమాదంపై జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ బుధవారం విచారణ చేపట్టారు. ముందుగా భూపాలపల్లిలో ఘనపూర్ పోలీస్‌స్టేషన్‌లోని అధికారులతో సమావేశమయ్యారు. పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను స్టేషన్ సీఐ కరుణాకర్‌రావు, ఎస్ఐ అశోక్‌ను అడిగి తెలుసుకొన్నారు. లారీ డ్రైవర్, ఓనర్, హార్వెస్టర్ డ్రైవర్‌ను విచారించారు.
తర్వాత జెన్కో అధికారులతో సమావేశమై.. ఆ రోజు లారీలో ఉన్న బొగ్గు వివరాలు తెలుసుకొన్నారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకుని నలుగురు ప్రత్యక్షసాక్షులను విచారించారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. తాడిచర్లకు వెళ్లి అకడ ఓపెన్‌కాస్ట్ ప్రతినిధులతో సమావేశమై ఆరోజు లారీ లోడ్ రికార్డులను పరిశీలించారు. ఒకటి రెండు రోజుల్లో ప్రాథమిక నివేదిక వివరాలను రవాణా కమిషనర్‌కు అందించనున్నట్టు తెలిసింది. ఆయన వెంట మోటరు వాహన తనిఖీ అధికారులు జంగ్లీ శ్రీనివాస్, శివపల్లి శ్రీనివాస్, బారగాడి శ్రీనివాస్, భూపాలపల్లి ఏఎంవీఐలు ఫాహిమా సుల్తానా, సుందర్‌లాల్, శ్రీనివాస్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

