కొల్లాపూర్, జూలై 17 : పీఆర్ఎల్ఐలో మరో ఘట్టం పూర్తయింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లిఫ్ట్-1లో రెండో మోటర్‌కు డ్రై రన్‌ను అధికారులు నిర్వహించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద రెండో పంపును టెస్ట్ రన్ చేశారు. 10 నిమిషాలపాటు ఫుల్ స్పీడ్‌తో డ్రై రన్ చేశారు. 145 మెగావాట్స్ బాహుబలి మోటర్ డ్రై రన్ విజయవంతం కావడంతో అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా వెట్ రన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
భళా బాహుబలి..
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అత్యధిక సామర్థ్యం ఉన్న బాహుబలి మోటర్లను ఉపయోగించారు. 2023 సెప్టెంబర్ 16న 145 మెగావాట్స్ బాహుబలి మోటర్ ద్వారా 2 టీఎంసీల కృష్ణా నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పంపింగ్‌ను నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 34 నెలల తర్వాత 2026లో జూలై 14న గంట వ్యవధిలోనే 0.01 టీఎంసీలను అదే మోటర్ ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి అధికారులు ఎత్తిపోశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ భారీ మోటర్లను డ్రై రన్ చేయకున్నా, సంవత్సరాల తరబడి నిరుపయోగంగా ఉంచినా.. తప్పని పరిస్థితిలో మళ్లీ ఆన్ చేసినా ఎలాంటి సాంకేతిక సమస్య లేకుండా విజయవంతంగా పనిచేయడం అంటే బాహుబలి మోటర్ సామర్థ్యంతో పాటు, కేసీఆర్ పాలమూరుపై చూపిన ముందుచూపునకు సాక్ష్యంగా నిలుస్తున్నదని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు నాణ్యత విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదు. దేశీయంగానే ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకొని బాహుబలి మోటర్లను తయారు చేయించింది. దీంతో అత్యంత నమ్మకమైన.. నాణ్యమైన మోటర్లు 34 నెలల తర్వాత కూడా సత్తా చాటాయి.