మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు(Thorrur) పట్టణ కేంద్రంలోని కాసం షాపింగ్ మాల్(Kasam Shopping Mall) ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే..కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సినీనటి ప్రియాంక మోహన్, పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి విచ్చేశారు. ఈ క్రమంలో షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక పైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్క సారిగా కుప్పకూ లిపోయింది. ఈ ప్రమాదం నుం సినీనటి ప్రియాంక మోహన్ సురక్షితంగా బయటపడ్డారు. ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయలవడంతో వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు.
తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి
కుప్పకూలిన స్టేజ్.. ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సి రెడ్డికి తీవ్ర గాయాలు
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీనటి ప్రియాంక మోహన్ మరియు పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సి… pic.twitter.com/S3vPX4c1Ag
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024