కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీతో ఆ పార్టీ నేతలు రెండు గంటలకుపైగా భేటీ అయ్యారు. ఒక్కొక్క నేతతో 10-15 నిమిషాలపాటు ప్రియాంక మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాలను పరిశీలిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. నేతల మధ్య చిన్న చిన్న విభేదాలే తప్ప పెద్ద సమస్యలేవీ లేవని ఆమె చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను కలవచ్చని ప్రియాంక తెలిపారు.
మరికొన్ని రోజుల్లో జరగనున్న మునుగోడు ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిని ఎంచుకునే బాధ్యతను నల్లగొండ నేతలకే అప్పగించినట్లు చెప్పారు. కోమటిరెడ్డితో మాట్లాడాలని రాజనర్సింహ, మధుయాష్కీలను పురమాయించారు. పరస్పరం సహకారం ఉంటేనే పార్టీ గెలుస్తుందని ప్రియాంక అన్నారు. అందరినీ కలుపుకొని పోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు.