Telangana | గద్వాల, ఫిబ్రవరి 9 : ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. యాసంగిలో డ్యాం ఆయకట్టు కింద రైతులు వివిధ పంటలు సాగుచేశారు. జూరాలపైనే ఆయకట్టుతోపాటు నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలు ఆధారపడి ఉన్నా యి. డ్యాంలో నీటిమట్టం తగ్గుతుండటం తో పంటల చివరి నాటికి నీళ్లు అందుతా యా? అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం హైదరాబాద్‌లో యాసంగికి సంబంధించి ఆయా ప్రాజెక్టుల నీటి లభ్యత మేరకు సాగునీటి ప్రణాళిక విడుదల చేసింది. అందులో భా గంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టులో ఉన్న నీటి లభ్యత ఆధారంగా వారబంది మేరకు నీటి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించా రు. అందులో భాగంగా రైతులు యాసంగిలో కేవలం ఆరుతడి పంటలే వేసుకోవాలని సూచించినప్పటికీ ఎక్కువ భాగం వరి వేశారు. పంటకు నీటి లభ్యత అవసరం ఉండటంతో సందిగ్ధం నెలకొన్నది.
డెడ్‌స్టోరేజీకి జూరాల
జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.6 టీఎంసీలు. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ వచ్చేసి 3.7 టీఎంసీలు. ప్రస్తుతం డెడ్ స్టోరేజీ నీటితో కలుపుకొని 5.287 నమోదైంది. ఈ నీటినే సాగునీటికి విడుదల చేయడంతోపాటు వేసవి ముగిసే వరకు తాగునీటి అవసరాల కోసం 0.4 టీఎంసీలు వాడుకోవాల్సి ఉన్నది.
కర్ణాటక దయతలిస్తేనే..
సాగు, తాగునీటి విషయంలో కర్ణాట క ప్రభుత్వం కరుణిస్తే తప్ప.. ఈ యాసంగిలో గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. రోజురోజుకూ జూరాల డ్యాంలో నీటిసామర్థ్యం తగ్గుతుండటంతో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, శ్రీహరి, మధుసూదన్‌రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కర్ణాటకకు వెళ్లారు. అక్కడి సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి శివకుమార్‌ను కలిశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఐ దు టీఎంసీల నీరు వదిలితే ఈ యాసంగిలో సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని విన్నవించారు. అందుకు వారు సానుకూలంగా స్పంది ంచినట్టు మంత్రి, ఎమ్మెల్యేలు తెలిపారు. కన్నడ సీఎం ఇచ్చిన మాట మేరకు నీటిని విడుదల చేస్తే ఇబ్బందులు ఉండవు.. లేకుంటే ఉమ్మడి జిల్లా ప్రజలకు తాగు, సాగునీటికి ఇబ్బందులు తప్పవు.