హనుమకొండ, నవంబర్13: హనుమకొండలోని స్మైల్ డిజీ పాఠశాల కరస్పాంటెండెంట్ శ్రీనివాస్వర్మపై పీడీఎస్‌యూ నాయకుల దాడిని నిరసిస్తూ గురువారం ప్రైవేట్ విద్యాసంస్థలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశాయి. ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు 3వేల మందితో భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు.
విద్యార్థి సంఘాల నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరస్పాంటెండెంట్పై దాడిచేసిన పీడీఎస్‌యూ నాయకులు మర్రి మహేశ్, గుర్రం అజయ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, డీఆర్వో గణేష్‌కు వినతిపత్రం అందజేశారు. ముందస్తుగా పోలీసులు కలెక్టరేట్ రెండు గేట్లు మూసివేశారు.