హైదరాబాద్ : నగరంలోని బహదూర్‌పుర పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మీర్ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు బస్సులో బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఓ గ్యారేజ్‌లోని నిలిపి ఉన్న బస్సులో మంటలు వచ్చాయి. వాటిని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడా ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, బస్సులో మంటలు చెలరేగడానికి మాత్రం కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.